Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్‌లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్‌కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.