Karnataka: కర్ణాటక బెళగావిలో జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో విషం కలిపారు. జూలై 14న జరిగిన ఈ సంఘటనలో, శ్రీరామ్ సేన అనే మితవాద గ్రూపుతో అనుబంధం ఉన్న స్థానిక నాయకుడు సహా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హులికట్టిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ చుట్టూ భయాందోళనలు, అనుమానాలను సృష్టించడమే…