నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020…