అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ బాధితులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు.