మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు.