Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది.