అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’తో గత యేడాది ఆగస్ట్ లో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అవి…