మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Munugode Bypoll : మునుగోడులో ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 3న నిర్వహించే ఉపఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.