Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్లు 51,92,220 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 25,37,136, పురుషులు 26,54,453, ఇతరులు 631…