కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్…