కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. BMW వెల్ట్, BMW ప్లాంట్‌ను గైడెడ్ టూర్‌లో సందర్శించారు. కార్లు తయారీ, బైకుల తయారీని పరిశీలించారు.
భారతదేశంలో బలమైన ఉనికిని పెంపొందిస్తూ ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స గురువారం రెండు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మ్యూనిచ్ నుండి బెంగళూరు, ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు రెండు కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు లుఫ్తాన్స ప్రకటించింది.