డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో గురువారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియలీ గిబ్సన్ (34; 24 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లిచ్‌ఫీల్డ్ (31; 20 బంతుల్లో 4×4, 1×6), భార్తీ ఫుల్మాలి (30; 20 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు సరిపోలేదు.…