WPL 2025: ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ముంబై ఇండియన్స్!
- డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు
- 47 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
- ఫైనల్‌లో ఢిల్లీతో ముంబై ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో గురువారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియలీ గిబ్సన్ (34; 24 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లిచ్‌ఫీల్డ్ (31; 20 బంతుల్లో 4×4, 1×6), భార్తీ ఫుల్మాలి (30; 20 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు సరిపోలేదు. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్ (3/31), అమేలియా కెర్ (2/28) రాణించారు. ఇక శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఢీకొంటుంది.
ఎలిమినేటర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. నాట్‌సీవర్ (77; 41 బంతుల్లో 10×4, 2×6), హేలీ మాథ్యూస్ (77; 50 బంతుల్లో 10×4, 3×6) హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 12 బంతుల్లో 2×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఏకంగా 73 పరుగులు పిండుకుంది. గుజరాత్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగులోనూ విఫలమైంది. నాలుగు క్యాచ్‌లు వదిలేసి ముంబై భారీ స్కోరుకు బాటలు వేశారు.
Also Read
భారీ ఛేదనలో గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూనీ (6), యోల్ (8), గార్డ్‌నర్ (8) విఫలమయ్యారు. ఈ సమయంలో దశలో గిబ్సన్, లిచ్‌ఫీల్డ్ ధాటిగా ఆడారు కానీ.. ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. వీళ్లిద్దరూ ఔట్ అయ్యాక గుజరాత్ 12 ఓవర్లలో 107/5తో ఓటమి అంచన నిలిచింది. భార్తీ ఫుల్మాలి మెరుపులు మెరిపించినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. 47 పరుగుల తేడాతో గుజరాత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!