డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో.. ఢిల్లీ ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. ముంబై (0.192) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న ఢిల్లీ (0.396) తుది పోరుకు అర్హత సాధించింది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు గురువారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో ముంబై తలపడనుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన…
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైకి.. ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ఐపీఎల్ మాదిరిలా ఉండదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో లీగ్…
డబ్ల్యూపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భార్తీ ఫుల్మాలీ (61; 25 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హర్లీన్ డియోల్ (24), లిచ్‌ఫీల్డ్ (22) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు హేలీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌కు ముందే ముంబై,…