Harmanpreet Kaur: అదే మా అసలైన బలం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం!
- 50 పరుగుల తేడాతో ఢిల్లీ చిత్తు
- ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం
- నమ్మకమే మా అసలైన బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మ్యాచ్ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘ఈ రోజు మేము ఆడిన విధానం చాలా సంతోషం కలిగించింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో చాలా నిరాశపడ్డాం. కానీ ఈ రోజు మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను అమలు చేశాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు. డబ్ల్యూపీఎల్-4లో భాగంగా శనివారం ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. హర్మన్‌ప్రీత్ (74 నాటౌట్; 42 బంతుల్లో 8×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
Also Read: IND vs ENG: న్యూజిలాండ్‌తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే!
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘గత మ్యాచ్‌లో కూడా నాకు మంచి ఆరంభం లభించింది. కానీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాను. ఈ రోజు బ్యాటింగ్‌కు వెళ్లేముందు నేను నాతోనే మాట్లాడుకున్నాను. నిన్నటి దాని గురించి ఆలోచించకుండా..ఈ రోజు కొత్త రోజు, కొత్త ఇన్నింగ్స్ అనే ఆలోచనతో మైదానంలోకి దిగాను. నా బ్యాటింగ్‌కు పూర్తి క్రెడిట్ భారత జట్టు, ఇప్పుడు ఉన్న ముంబై జట్టుకూ ఇస్తాను. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అది నేను స్వేచ్ఛగా ఆడేలా చేసింది. గత మ్యాచ్ చివరి దశలో ఒక మంచి బంతి వేస్తే సరిపోయేది. దురదృష్టవశాత్తు అది జరగలేదు. అయినా కూడా చివరి వరకు మేము మ్యాచ్‌లోనే ఉన్నాం. అదే మాకు ఈ రోజు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నిన్న సరిగా ఆడకపోయినా మ్యాచ్‌లో నిలబడ్డామంటే.. నమ్మకం, ఆత్మవిశ్వసమే కారణం. నిజం చెప్పాలంటే ప్రతి వికెట్ నాకు ఆనందాన్ని ఇచ్చింది. టీ20 క్రికెట్‌లో 10 వికెట్లు తీస్తే.. ఓ సారథిగా అంతకంటే జట్టు నుంచి మరేమీ కోరలేం. మా ఫీల్డింగ్‌పై చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!