Air Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై కూడా చేరినట్లైంది. గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణ వేత్తలు, ముంబై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.