కేరళలో సోమవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ మధ్య వాహనంలో సీఎం కూడా కూర్చున్నారు. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు ముందు ఓ మహిళ అకస్మాత్తుగా స్కూటర్‌పై రావడంతో ఈ ఘటన జరిగింది.