దేశంలో కరోనా సమయంలో కూడా కొంత మంది వ్యాపారస్తుల ఆస్తులు భారీగా పెరిగాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది. కరోనా ఆర్థిక వ్యవస్థపైన ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, దేశంలోని కొంతమంది వ్యాపారస్తులపై దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. పైగా వారి సంపద 50 శాతంమేర పెరిగినట్టుగా ఫోర్బ్స్ తెలియజేసింది. 2021 జాబితా ప్రకారం దేశంలోని మొత్తం…