మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా…