Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.…