MS Dhoni Turns 43 Today: అతడి రాక భారత క్రికెట్‌కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా…
Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు. వికెట్ కీపర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో జులపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.…