Asif Ali Zardari: పాకిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్తగా పేరు సంపాదించుకున్న జర్దారీ, 2007లో ఆమె బాంబు దాడిలో మరణించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్‌గా ఉన్న ఆయన భార్య మరణం తర్వాత వచ్చిన సానుభూతితో 2008-13 వరకు పాక్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు.