అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది.