నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. ఈ దాడికి ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో.. ముంపునకు గురైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి సందర్శించేందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బయలుదేరారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో అరవింద్ కారుపై దాడి చేసారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. గతేడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు…
టీఆర్ఎస్ బంద్ అయ్యి బీఆర్ఎస్ రావాలని నాకు ఆతృత గా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేస్తామని మేము చెప్పలేదు అయినా చేసినామన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేసింది నీ తండ్రే అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. ఎస్సి, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.టీఆర్ ఎస్ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.…
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణలు హజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్‌ఎస్ అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపండని, తెలంగాణ వచ్చిందే యువకుల కోసం, అలాంటి యువత కోసం ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అబద్ధానికి…
కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేసిండు అని.. పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముందుగా కేసీఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.. అరిగి పోయిన రికార్డు లాగా కొత్త విద్యుత్ బిల్లు గురించి మళ్లీ మళ్లీ అవే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించిన ఆయన.. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో…
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…