Chintala Ramachandra Reddy : కుటుంబ పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్ ఇంటి ముందు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు వచ్చి.. ఆయన నివాసంపై దాడి చేశారు. దీంతో అర్వింద్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. భారీగా బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. ఎంపీ అర్వింద్ ఇంటి దాడి మీద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మీడియా ముఖంగా కవిత చెప్పుతో కొడతా….. చంపుతామని చెప్తున్నా… పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కుటుంబ పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీని మర్డర్ చేస్తారా? అందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ఆయన మండిపడ్డారు.
నాయకులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యావత్తు తెలంగాణ తల దించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ ఇంటిపై దాడికి వారి మీద 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే డీజీపీనీ కలుస్తామని ఆయన వెల్లడించారు. అలాగే కవిత వ్యాఖ్యల పట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
డీజీపీ కూడా స్పందించకుంటే న్యాయస్థానంను అశ్రయిస్తామన్నారు. దాడి చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు కమీషనర్ తెలిపారని, ప్రెస్ మీట్ లో కవిత మాటలను కమిషనర్ వీక్షించారన్నారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో గతంలో మా కార్యకర్తల మీద జరిగిన దాడికి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, కేసు కూడా బుక్ చేయలేదన్నారు. బీజేపీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని, మండల స్థాయిలో దాడికి నిరసనగా కేసిఆర్ దిష్టి బొమ్మతో పాటు…నిరసన తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!