కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లకు కూడా ప్రభుత్వం తెలిపింది.