‘శ్రీరస్తు… శుభమస్తు…’ అన్న పదాలు మనవాళ్ళకు మహదానందం కలిగిస్తాయి. ముఖ్యంగా శుభలేఖల్లోనూ ఈ పదాలు ప్రధానస్థానం ఆక్రమిస్తుంటాయి. శుభకార్యాల్లోనూ ఈ పదాలే జనానికి ఆనందం పంచుతూ ఉంటాయి. ‘శ్రీరస్తు-శుభమస్తు’ టైటిల్ తో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 1981 సెప్టెంబర్ 26న విడుదలయింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో ఈ మధ్య చిరంజీవి మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం రూపొందింది. ‘శ్రీరస్తు-శుభమస్తు’ కథలో…
మారే కాలంలో మారని కథలెన్నో! కొన్ని కథలు కాలంతో పోటీ పడుతూ సాగుతుంటాయి. కథలు పాతవైనా, సమకాలీన పరిస్థితులను గుర్తు చేస్తుంటాయి. అలా కాలానికి నిలచిన సినిమా ‘న్యాయం కావాలి’. సాంకేతికంగా మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగినా, కొందరు మనుషులు వారి మనసులు ఎన్నటికీ మారవని చాటే కథ ‘న్యాయం కావాలి’లో ఉంది. నమ్మించి అమ్మాయిలను బుట్టలో వేసుకోవడం, వారిని మెప్పించి, ఒప్పించి ఒకటవ్వడం, కోరిక తీరగానే వేరే దారి చూసుకోమని చెప్పడం – ఆ నాడే…