Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.