తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.