పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.…