రాష్ట్రంలో పేకాట క్లబ్బులను పూర్తిగా నిర్మూలిస్తామని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు మాత్రం పేకాట రాయుళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో పేకాట క్లబ్బులు మూతపడడంతో బడాబాబులు గ్రామాల్లో మామిడితోటల్లోని ఫామ్ హౌస్ లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. పేకాట మీద దాడులు చేస్తున్నట్టు నటిస్తున్న పోలీసు అధికారులు కూడాతృణమో పణమో తీసుకుని వదిలిపెడుతున్నారు. పేకాట స్థావరాల్లో దొరికిన భారీమొత్తాన్ని పోలీసులు నొక్కేశారన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆ…