మోహన్ లాల్ – ఈ పేరు మళయాళ సీమలో ఓ సమ్మోహనం! ముద్దుగా బొద్దుగా ఉంటూనే పాత్రకు పరిమితమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ మోహన్ లాల్ సాగుతున్నారు. కేరళ వాసులు కేరింతలు కొడుతూ మోహన్ లాల్ చిత్రాలను ఆదరిస్తున్నారు. వారిని అలరించేందుకు తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు మోహన్ లాల్. కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారాయన. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ మోహన్ లాల్ నటించి మురిపించారు.…