మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మోక్షజ్ఞ కనిపించొచ్చని టాక్ వినిపించింది కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ నిరాశచెందారు. కొంతకాలం తర్వాత దన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని…