రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా.. తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండి పేట వై జంక్షన్ వద్ద రన్నింగ్ కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో నుండి మంటలు రావడం గమనించిన యజమాని అప్రమత్తమై కారులో నుంచి కొందికి దిగి పరుగులు పెట్టాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తన కళ్ల ముందే కారు క్షణాల్లో పూర్తిగా కాలి బూడిదైంది.…