మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ…