నటప్రపూర్ణ డాక్టర్ యమ్.మోహన్ బాబు తనదైన అభినయంతో వందలాది చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనావారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, కూతురు మంచు లక్ష్మి సైతం సాగుతున్నారు. ఇప్పటికే తనయులతో కలసి నటించి అలరించిన మోహన్ బాబు, తొలిసారి కూతురు లక్ష్మితో కలసి ‘అగ్నినక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుర్వాసునిగానూ తనదైన అభినయంతో అలరించనున్నారు మోహన్ బాబు. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’…