రష్యా – ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫీయాన్ (24) ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నారు. గత రెండేళ్లు గా దుబాయ్ హోటల్ లో పని చేస్తున్న సూఫియాన్ తో పాటు మరో నలుగురిని అక్కడి నుండి రష్యా పంపించి నమ్మించి రష్యా భాషలో ఉన్న అగ్రిమెంట్ కాగితాల పైన సంతకాలు చేయించి సైన్యం లో చేర్పించాడు ఏజెంట్. వారి కోసం కుటింబీకులు నానా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన హసన్…