ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో…