Maldives Elections : మాల్దీవుల్లో ఏప్రిల్ 21న పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడయ్యేందుకు ఇదే తొలి లిట్మస్ టెస్ట్. అయితే ఆయన విమర్శకులు, ఎన్నికల పండితులు మాత్రం ఆయన పార్టీ ఓటమిని అంచనా వేస్తున్నారు.
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.