Somalia Explosions: భారీ పేలుళ్లతో సోమాలియా దేశం దద్దరిల్లిపోయింది. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందినట్లు చెందినట్లు సమాచారం.
సోమాలియా రాజధాని మొగదిషులోని హయత్ హోటల్‌పై అల్-షబాబ్ ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 30 గంటలపాటు కొనసాగిన అల్-షబాబ్ జిహాదీల ఘోరమైన ముట్టడిని సోమాలియా దళాలు ముగించాయని శనివారం అర్ధరాత్రి భద్రతా కమాండర్ మీడియాతో వెల్లడించారు.
సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్‌యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్ బాంబర్ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్ అడెన్ హసన్ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్ సమీపంలో పేలుడు…