ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అంబటి ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి కాదు.. మంత్రి అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన చిప్ పనిచేయడం లేదేమో. ఆత్మకూరులో రాజకీయం కోసం.. ఓట్ల కోసం ఇన్ఛార్జులుగా మండలానికో మంత్రిని ఇన్ఛార్జీగా వైసీపీ నియమించింది. అలా ఇన్ఛార్జులుగా వేసిన మంత్రులను వెంబడిస్తానని నేను అన్నాను. దానికి విపరీతార్దాలు మంత్రి అంబటి విపరీతార్ధాలు తీశారు.రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను తామూ వెెంబడిస్తామని అంబటి…