Mobile Usage: భారతదేశంలో గత 13 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని, ఇది మానవ ప్రవర్తనల్లో గణనీయమైన మార్పుకు కారణమైంది. బెస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిర్వహించిన ఇటీవల అధ్యయనంలో తేలింది. భారతీయుల్లో 31 శాతం మంది లేవడంతోనే స్మార్ట్‌ఫోన్లకు అంకితమైపోయారని చెప్పింది. 84 శాతం మంది యూజర్లు నిద్రలేచిన మొదటి 15 నిమిషాల్లోనే తమ ఫోన్లను చెక్ చేస్తున్నారని తెలిపింది.సగటును ఒక స్మార్ట్‌ఫోన్ యూజర్ ఒక రోజులో 70-80 సార్లు పికప్ చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు.