ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత నెల రోజుల నుండి విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వాలు గానీ ఇటు జిల్లా అధికారులు గానీ స్పందించడం లేదన్నారు. కాకినాడ యుటిఎఫ్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి మాట్లాడారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో…