నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటిస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంటు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దోనుర్, సింగందొడ్డి, లాఖ్య తండా, మంగళిగడ్డ తండా, మోత్కూలకుంటా తండా మీదుగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది.