భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి…