నిధులు లేకున్నా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. వాటికి భారీగా ప్రచారాలు చేసుకోవడం ఇప్పుడు చిక్కొచ్చి పడింది. స్వపక్షానికి.. విపక్షాలకు ఆ ఎమ్మెల్యే టార్గెట్ అయ్యారు. కాసులు లేకుండా కితకితలెందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నిధులు లేకుండా అభివృద్ధి పనులకు భూమి పూజలుయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్య ఆలేరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.…