గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పార్టీలో చర్చగా మారాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పంచాయితీ బట్టబయలైంది. నియోజకవర్గ పరిధిలో ఎవరి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగాలన్నదానిపై చర్చ హీటెక్కించిందట. దాని చుట్టూనే ప్రస్తుతం పార్టీ వర్గాల చెవులు కొరుకుడు ఎక్కువైంది. ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ప్రతిపాదించారట. ఆ మాటలు వినగానే కేటీఆర్ తీవ్ర అసంతృప్తి…