ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు టీడీపీ నిరసనలు, మరోవైపు బీజేపీ సభలతో వైసీపీని టార్గెట్ చేశాయి. అయితే బీజేపీ సభల్ని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీలో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. ప్రజలు టీడీపీ,బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ ఏపీ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ….కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి గుర్తుకు రావడం లేదా? అని…