కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైసీపీలో కొత్త సెగలు రేగుతున్నాయి. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇద్దరూ పిఠాపురం కేంద్రంగా పొలిటికల్ ఎత్తుగడలు వేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ అవి కాకరేపుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు వేసే ఎత్తుగడలు.. రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి. వంగా గీత కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ తరఫున జడ్పీ ఛైర్‌పర్సన్‌గా.. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. వంగా గీత సొంత నియోజకవర్గం పిఠాపురం. కాకినాడ…