సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్‌తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు.
Kethireddy Venkatarami Reddy: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను.. మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ…